తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.
ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.
టీడీపీ-జనసేన పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్.. టీడీపీకి రాత్రికి రాత్రే మద్దతు తెలపడం కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బంది కలిగించిందన్నారు.. ప్రధాని మోడీ నన్ను అర్థం చేసుకున్నారు అని పవన్ చెప్పడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఉన్న నిస్పృహ ను అర్ధం చేసుకోవచ్చు అన్నారు.
గత ఎన్నికలలో గెలుస్తామో లేదో తెలియదు కానీ బరిలో నిలబడాలి అని నిర్ణయించి పోటీకి దిగానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సారి పరిస్థితి అలా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ మహాత్ముడు అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చని.. కానీ జగన్ ప్రజా కంటకుడు అని విమర్శలు గుప్పించారు.
బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు.
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు పొందాడు.ఈ దర్శకుడు మొదట కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే మెహర్ రమేష్ కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. 2008లో జూనియర్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.