జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ పవన్‌కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి రావాల్సి ఉంది. అయినా లోకేష్ కార్యక్రమంలో పాల్గొనటానికి పవన్ విశాఖ బయల్దేరారు.
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు.
Barrelakka Responds on comparision with Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినా జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని…
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న వర్మ.. ఇప్పుడు కొంతమంది బయోపిక్ లు తీసి వివాదాలను సృష్టిస్తున్నాడు.
విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
జబర్దస్త్’ కామెడీ షో తో ఎందరో కమెడియన్లు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం వారు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు. అలా రానిస్తున్న వారిలో సత్యశ్రీ కూడా ఒకరు . ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ కూడా ఈమె రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.
పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు ఉంటాయని.. ఇది సహజమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీవీతో మంత్రి మాట్లాడారు. 175 గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. తాజాగా వచ్చిన సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు.
ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా బన్నీవాస్ను నియమించారు.. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్‌కు అందజేశారు జనసేనాని..