Pawan Kalyan: నువ్వు సిద్ధమంటే.. మేం యుద్ధం అంటామంటూ వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా అనేక విషయాలపై స్పందించారు.. జగన్ సిద్ధం అంటే.. మనం యుద్ధం అంటాం.. అయినా, మనం యుద్ధం చేయాల్సిన అంత గొప్పవాడా? కదా? అనేది మనమే నిర్ణయించుకోవాలన్నారు.. సిద్ధం పోస్టుల గురించి కొంతమంది చెబితే సినిమా డైలాగులు మనకొద్దని చెప్పా.. నువ్వు సిద్ధమంటే మేం యుద్ధమని చెబుతాం.. కానీ, నేను సింహం లాంటోండని సీరియస్ గా జగన్ కి చెప్పలేను అన్నారు. నిజజీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడుతా.. విశాఖలో గోడల బద్ధలు కొట్టుకుని వెళ్దాం అన్నారు. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటానన్న ఆయన.. పుల్ల కొరకు పోయి అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Anjali Menon: ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న అంజలి..
మరోవైపు.. ఓటు చీలకుండా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చి ఎంత నలిగిపోయాను నాకు తెలుసు.. ఈ మాటతో జాతీయ నాయకుల వద్ద ఎన్ని చివాట్లు తిన్నాను నాకు తెలుసు.. కానీ, నేనెప్పుడూ జనసేన ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించలేదు.. తెలుగు ప్రజల భవిష్యత్తు గురించే ఆలోచించానని వెల్లడించారు పవన్ కల్యాణ్.. పొత్తులు బలంగా నిలబడాలి.. మనలో మనకి ఇబ్బందులు త్యాగాలు తప్పవన్నారు.. ప్రతి ఎన్నికల్లో మూడో వంతు బలంగా జనసేన తీసుకుంటుంది.. మన ఓటు టీడీపికి ట్రాన్స్ఫర్ అయితేనే.. స్థానిక ఎన్నికల్లో మరింత బలపడగలం అన్నారు.
Read Also: Minister Dharmana Prasada Rao: తెరమీద బొమ్మలు చూడకండి.. రియల్ హీరో జగన్..
ఇక, మనుషులతో ఎలా మెలగాలి అనేది భీమవరం నాకు నేర్పించిందన్నారు పవన్.. జనసేన ప్రభుత్వం ఏర్పడగానే పొట్టి శ్రీరాములు దివ్య స్మృతి ఏర్పాటు చేయాలి.. అంబేద్కర్, అల్లూరి, పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తులు కాదని స్పష్టం చేశారు.. కులాల ఐక్యత కోసం నేను తపన పడేవాడిని.. కులాల ఐక్యత ప్రజలకు మేలు చేయడానికి తప్ప.. విడగొట్టడానికి కాదన్నారు. జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు.. కానీ, అతను చేసే విధానాలు విచ్ఛిన్నంగా ఉంటాయన్నారు. కులాలు మనం కలుపుకొని వెళ్తూ ఉంటే.. అధికారం కోసం కులాలను విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళని కొందరికి ముద్ర వేసి పంపించారు.. బీసీలకు సీట్లు ఇస్తున్నామంటూ నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు అని విమర్శించారు. మిగతా కులాల సంఖ్య బలం ఎక్కువ అయినా అధికారం మాత్రం జగన్ దేనన్న ఆయన.. ఒక కులం ఎదగడం అంటే మరొక కులం తగ్గడం కాదు.. అన్ని కులాలు సాధికారత సాధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కులాల్లోని నాయకులు ఎదగడం కాదు.. కుల సమూహాలు లబ్ధి పొందాలి.. నాయకులు కులాల్ని వాడుకుని ఎదుగుతున్నారు. ఆ పరిస్థితులు మారాలని సూచించారు. 2016 నుంచి సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టా.. కులాల మధ్య పడకపోవడానికి ఇబ్బందులు ఏంటని ఆలోచన చేశానని.. అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారని తెలిపారు.. కాపు కులంలో పుట్టినంత కాపుల కోసమే పని చేస్తానని చెప్పడం లేదు.. అందరి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.