Bigg Boss Fame Vasanthi Krishnan and Pawan Kalyan got married: బిగ్‍బాస్ 6 తెలుగుతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. మంగళవారం అర్థరాత్రి తిరుపతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వాసంతి, పవన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బిగ్‍బాస్, సీరియల్ నటులు కొందరు హాజరయ్యారని తెలుస్తోంది. వాసంతి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు వాసంతికి శుభాకాంక్షలు చెపుతున్నారు.
తిరుపతికి చెందిన వాసంతి కృష్ణన్ ప్రస్తుతం సీరియల్స్‌తో ఓటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వాసంతి.. గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. కాలీఫ్లవర్, భువన విజయం, మనే నం.67, సీఎస్ఐ సనాతన్ లాంటి పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు. తెలుగుతో పాటు కన్నడలోనూ వాసంతి పలు సినిమాలు చేశారు.
Also Read: Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!
ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్‌తో వాసంతి కృష్ణన్ గతేడాది ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబరులో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల కాబోయే భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని.. అందరి ముందే ముద్దు పెట్టుకున్నారు. ఇక ఇపుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పవన్ కూడా నటుడే. హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. వీరి పెళ్లి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.