తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు.
Pawan Kalyan: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు.
Pawan Kalyan: ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి.
సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్…
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న "తెలుగు జన విజయ కేతనం జెండా" సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.