Chandrababu: సమష్టిగా కలిసి పని చేద్దాం.. ఏపీని తిరిగి గాడిలో పెడదాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది.. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లు ఈ బహిరంగ సభ వేదికగా కీలక ఉపనస్యాలు చేసిన విషయం విదితమే కాగా.. ఇక, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఏపీ వాసులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.. సమష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పని చేద్దాం అన్నారు.. ప్రజాగళానికి కదిలి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజా మద్దతుతో వారి హక్కుల కోసం పోరాడి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందన్నారు.. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు..
Read Also: Electoral Bonds : డీఎంకేకి భారీగా విరాళమిచ్చిన లాటరీ కింగ్.. పార్టీకి వచ్చిన వాటిలో ఆయనదే టాప్
Also Read
కాగా, ప్రాంతీయ ఆకాంక్షలు, దేశ ప్రగతి ప్రాతిపదికన ఎన్జీఏ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో విద్యాసంస్థలను కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం.. తిరుపతిలో ఐఐటీ, ఐఎస్సార్, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఐఐపీఈ, ఎయిమ్స్ నిర్మించామని, విజయనగరం జిల్లాలో నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం అన్నారు.. మరోవైపు విపక్షాలపై విమర్శలు సంధించిన ఆయన.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.. ఇక, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ.. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు అని గుర్తు చేశారు.. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే
I thank everyone who joined us at the #Prajagalam in Palnadu today. Your overwhelming support further strengthens our resolve to fight for your rights and create a brighter future for our State. Together, we shall win. Together, we shall put our beloved Andhra Pradesh back on the… pic.twitter.com/WI6JgAS17A
— N Chandrababu Naidu (@ncbn) March 17, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?