ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం…
గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు... పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.