రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలని సూచించారు.. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలని హితవుపలికారు.. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.. బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ, అది సున్నా..…