బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డితో మాట్లాడి వైసీపీలో జగన్ సమక్షంలో చేరాను అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాను అని ఆయన తెలిపారు. వంగవీటి రంగాను అభిమానించే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎలా జట్టు కడతారు అని ప్రశ్నించారు. వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీనే అని వంగవీటి నరేంద్ర ఆరోపించారు.
Read Also: Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు..
వంగవీటి రంగా హత్య కేసులో ఉన్న వారిని టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించింది అని వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పని చేసింది అని పేర్కొన్నారు. జగన్ హయాంలో పేదలకు సాయం అందింది.. రాష్ట్రంలో మరోసారి వైసీపీకే ప్రజల మద్దతు ఉంటుంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.