Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. సినిమాలకు బ్రేక్ చెప్పి, ప్రచారాలకు ఎక్కువ సమయాన్నీ కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో అప్డేట్ అడుగుతుంటే.. తరువాత తరువాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్.. ఈరోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. పవన్ -హరీష్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ కాకుండా మరో స్పెషల్ టీజర్ ను భగత్ బ్లేజ్ అనే పేరుతో నేడు అమెజాన్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ బ్లేజ్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాను హీట్ ఎక్కించాయి. “గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది”, “ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం..” ఈ డైలాగ్స్ పై అభిమానులు సంతోషంగా ఉన్నా కూడా .. ఇవి పొలిటికల్ పంచ్ లానే ఉన్నాయని కొంతమంది చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కావాలనే ఈ డైలాగ్స్ రాయించుకున్నాడు అని కూడా చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఒక మీటింగ్ లో పవన్.. ఈ వార్తలపై స్పందించాడు. తనకు ఈ డైలాగ్ లు చెప్పడం ఇష్టం లేదని, కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ బాధ పడలేక ఆ డైలాగ్స్ చెప్పాను అని తెలిపాడు. ” భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక గ్లాస్ పడేస్తాడు. గాజు గ్లాస్ కిందపడి ముక్కలైపోతుంది. షూటింగ్ చేసినప్పుడు ఎందుకు రాశావ్ అని అడిగా.. అందుకు హరీష్.. లేదు అందరూ మీరు ఓడిపోయారు.. ఓడిపోయారు అని అంటున్నారు అనగానే నేను ఆయనకు ఒకటే చెప్పా.. గాజుకున్న లక్షణం ఏంటంటే.. పగిలేకొద్దీ పదునెక్కుద్ది. బేసిక్ గా నాకు ఇలాంటి డైలాగ్స్ ఇష్టం ఉండదు.. కానీ, హరీష్ శంకర్ బాధ భరించలేక చెప్పాను. లేదు సర్.. మిమ్మల్ని తగ్గించడం మాకు ఇష్టం ఉండదు అని చెప్పి పెట్టించాడు. ఇక ఆయన బాధ తట్టుకోలేక చెప్పాల్సి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ గబ్బర్ సింగ్ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.