TG Vishwa Prasad Says I was lucky to work with Pawan Kalyan: తాను చిన్నప్పటి నుంచి ‘మెగాస్టార్’ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నానని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం తన అదృష్టమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి…
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల…
శనివారం నాడు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని…
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
నీట్ వివాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంకోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం…
వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు.
Pawan Kalyan Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఆయన సైన్ చేసిన మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలలో భారీ పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఈ…
ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది.…