బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
Stones On Vande Bharat Train: లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22346)పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో నిందితులు రాళ్లు రువ్వి రైలు సీ5 కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. వందేభారత్ రైలు నంబర్ 22346పై రాళ్లు రువ్వబడ్డాయి.…
ఇదిలా ఉంటే, బీహార్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఇది వ్యవస్థీకృత వైఫల్యం కాదన్న నిర్ధారణకు వచ్చామని కోర్టు పేర్కొంది.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి అరెస్ట్‌గా బీహార్‌లో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తొలి అరెస్టులు చూపించింది.
దేశ వ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు.