Waqf Board: 50 ఏళ్ల నివాస ప్రాంతానికి వక్ఫ్ బోర్డు నోటీసులు.. 30 రోజుల్లో ఖాళీ చేయాలని హుకూం..
- 50 ఏళ్లుగా నివాసం.. వక్ఫ్ బోర్డు నోటీసులు..
- 30 రోజులో ఖాళీ చేయాలని హుకూం..
- పాట్నా హైకోర్టుకు చేరిన సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board: ఇటీవల వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కళ్లెం వేయడానికి ఈ వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులోని నియమాలను సంస్కరించడానికి ఈ బిల్లుని తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రకటించింది. అయితే, దీనిని కాంగ్రెస్‌తో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో బిల్లుని చర్చించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇది మైనారిటీలపై, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది.
ఇదిలా ఉంటే, బీహార్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
Read Also: Shivaji Statue: షాకింగ్ న్యూస్.. శివాజీ విగ్రహం కూలుతుందని ముందే తెలుసు.. చెప్పినా పట్టించుకోలేదు!
దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు బిల్లుపై పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని పాట్నాలోని గోవింద్‌పూర్ గ్రామంలో నుంచి తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి, సదరు భూమి వక్ఫ్‌దిగా క్లెయిమ్ చేసింది. వక్ఫ్ బోర్డు ఆధారాలు సమర్పించడంలో విఫలం చెందడంతో బాధితులకు ఉపశమనం లభించింది. అయితే, ఇప్పటికీ నోటీసులు తొలగించకపోవడంతో పలువురు నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.
‘‘ఈ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదని పేర్కొంటూ మాకు నోటీసు వచ్చింది మరియు వచ్చే 30 రోజుల్లో ఈ స్థలాన్ని వదిలివేయాలని కోరింది. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాము’’ అని పిటిషనర్ రామ్ లాల్ అన్నారు. ఇదిలా ఉంటే సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇర్షాదుల్లా మాట్లాడుతూ.. ఒకసారి వక్ఫ్ భూమి, ఎల్లప్పుడూ వక్ఫ్ ఆస్తి అని, ఈ భూమి ఆక్రమణకు గురైందని ఆయన అన్నారు. దీనిపై బీహార్ మంత్రి జమాఖాన్ మాట్లాడుతూ, ఈ అంశంపై విచారణ జరుగుతోందని, వక్ఫ్ భూమిగా తేలితే వారికి అప్పగిస్తామని లేని పక్షంలో దానిని వదులుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!