ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో డాక్టర్లు ధర్నాకు దిగారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. ఇక్కడ ఆసుపత్రి వైద్యులు నిస్సహాయ రోగిని ఆసుపత్రి నుండి తొలగించి రోడ్డుపై వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో రోగి రెండు కాళ్లు పోయాయి. పూణెలో ఓ నిరుపేద వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని సాసూన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒక వైద్యుడు.. పారామెడికల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రి నుండి బయటకు తీసుకువచ్చి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారిపై వదిలిపెట్టారు. ఈ…
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు.
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.
జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్డు లేక ఓ పేషెంట్ ను నేలపై డాక్టర్లు పడుకో బెట్టి వైద్యం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాడు.
Vijayawada: ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏ పరిస్థితిలో ఉన్నారు కూడా చూడకుండా లైంగికదాడులకు పాల్పడుతున్నారు.. పిసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఘాతుకానికి పాల్పడుతున్నారు.. తాజాగా, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరోసారి కలకలం రేగింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి.. గత అర్థరాత్రి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అది గమనించిన తోటి రోగులు.. అటెండర్లు.. కామాంధుడి దుశ్చర్యను అడ్డుకున్నారు.. ఈ…
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లుపట్టుకుని తల్లిదండ్రులు వైద్యం కోసం లాక్కొని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. కలెక్టర్, మంత్రి హరీశ్ రావు తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది.