Nizamabad Hospital: ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన.. తల పట్టుకుంటున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Hospital: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లుపట్టుకుని తల్లిదండ్రులు వైద్యం కోసం లాక్కొని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. కలెక్టర్, మంత్రి హరీశ్ రావు తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇద్దరు ప్రొఫెసర్లతో డి.ఎం.ఈ. రమేష్ రెడ్డి కమిటీ వేశారు. రోగిని కాలు పట్టుకుని వెళుతున్నప్పుడు వీడియో వైరల్ చేసిన వ్యక్తి పై ఆసుపత్రి అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. రోగికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు ఇంకా దొరక్క తలలు పట్టుకుంటున్నారు. డేటా ఎంట్రీ ప్రకారం హన్మాండ్లు బోధన్ అర్సపల్లి గా నమోదు చేయడంతో సమాచారం తప్పుగా నమోదు చేయించారని అధికారులు భావిస్తున్నారు. కాగా రోగి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు. వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నానా తంటా పడుతున్నారు. ఒక రోగి ఆసుపత్రికి వస్తే అతని పేరు ఫోన్ నెంబర్ తో సహా ఫైల్ చేస్తారు. అలాంటిది రోగి వైద్యం కోసం వచ్చిన ఫైల్ లో సరైన సమాచారం లేకపోవడం పై పలు అనుమానాలకు దారితీస్తోంది.
అసలే జరిగింది..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బయట నుంచి లోపలికి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిని తీరు అందరిని కలిచివేదసింది. తమ కొడుకు అనారోగ్యంతో వున్నాడని ఆసుపత్రిలో స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని సహరించాలని కోరినా ఎవరు నోరుమదపలేదని అన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోగి కాళ్లు పట్టుకుని తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిజామాబాద్ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వసులులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లి వైద్యులు అందుబాటులో ఎవరూ ఉండని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో వైద్యులు, స్ట్రెచర్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్యాసింజర్ ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్
అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ స్పందించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మార్చి 31న పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. చిట్టితో ఓపీ వచ్చేలోపు లిఫ్ట్ రావడంతో పేషెంట్‌ను తల్లిదండ్రులు లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్తుకు చేరుకున్న రోగిని వీల్ చైర్ లోనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఏం జరిగిందో తెలియని ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసుపత్రిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని ఆమె తెలిపారు.
IPL 2023 : ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!