అమ్మో ప్రభుత్వ దవాఖానాలు అంటేనే ఆమడ దూరం పారిపోయే జనం.. ఆ అపోహాల నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రజలు బయట పడుతున్నారు. అయితే.. కొన్ని చోట్ల ప్రభుత్వం ఎంత చెప్పిన కొందరు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. సేమ్ ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో చోటు చేసుకుంది.
Read Also: Malaika Arora: ఖతర్నాక్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న మలైకా అరోరా
జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్డు లేక ఓ పేషెంట్ ను నేలపై డాక్టర్లు పడుకో బెట్టి వైద్యం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాడు.. బెడ్స్ లేకపోవడంతో మనోజ్ ను సిబ్బంది నేల మీద పడుకోబెట్టారు.. బెడ్ ఖాళీ అయితే ఇస్తామని వైద్య సిబంది చెప్పారు.. అప్పటి వరకు మనోజ్ ను ఆరు బయట ఉన్న నేలపై పడుకోబెట్టారు.
Read Also: Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
దీంతో పేషెంట్ మనోజ్ కు జ్వరం ఎక్కువ కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీంతో హాస్పిటల్ కి వచ్చిన రోగులు సిబ్బంది పనితీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పటల్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వెంటనే ఆస్పత్రి సిబ్బందితో పాటు సదరు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.