Contact Lense: ఈ రోజుల్లో చాలా మంది కళ్లద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల అందం పాడవుతుందని కొందరు.. మచ్చలు ఏర్పడుతున్నాయని మరికొందరు కాంటాక్ట్ లెన్సులను వాడేస్తున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటన విషాదంగా మారింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, శ్రీనివాస్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఆయన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది.…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో భీమారంకు చెందిన రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ అడిషనల్ కలెక్టర్…
ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది. జ్వరంతో వచ్చిన…
రోగి నుండి బంగారం చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన హృద్రోగ సమస్యలతో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. వైద్యం కొరకు ఆసుపత్రికు వచ్చిన రోగి నుండి జక్కిరాముడు అనే వార్డు బాయ్ బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటంతో ఆమె మనువడు…
విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా…