ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు.
ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి (83) కన్నుమూశారు. ఇంట్లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1940, నవంబర్ 15న ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జన్మించారు. ఏప్రిల్ 12, 2024న ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు.
ISRO Valarmathi Passes Away: ఆమె గొంతు ఎంతో ప్రత్యేకం. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) సాధించిన ఎన్నో విజయాలు ఆమె గొంతులోనే మొదలయ్యారు. అలాంటి గొంతు మూగబోయింది. దీంతో ఇస్రోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి కొన్ని గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనకు ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది. అయితే ఆ వాయిస్ ఇచ్చేది ఎవరో కాదు ఇస్రో సైంటిస్ట్ వలార్మతి.…
YVL N Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు.
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి 32 ఏళ్లు. అయితే బైక్ పై నుంచి పడిపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. నల్గొండ జిల్లా ప్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నాయకుడు అట్టా స్వామి. అంశాల మృతి పట్ల రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు వంటి ప్రముఖులు మృతి చెందారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసీల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978),…
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి పద్మశ్రీ భాష్యం విజయ్ సారథి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ సారథి కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
lohitashwa prasad: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో విషాదం నేడు చోటు చేసుకుంది. కన్నడ ప్రముఖ నటుబు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు.