Amshala Swamy: అంశాల స్వామి మృతి.. కేటీఆర్ ప్రగాఢ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amshala Swamy: ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి 32 ఏళ్లు. అయితే బైక్ పై నుంచి పడిపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. నల్గొండ జిల్లా ప్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నాయకుడు అట్టా స్వామి. అంశాల మృతి పట్ల రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. అంశాల ఫ్లోరోసిస్ బాధితుడు, వారి కోసం నిరంతరం పోరాడాడు. ఆయన ఎంతతో మందికి స్పూర్తి .. అంశాలస్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడు..అతని ఆత్మకు శాంతి చేకూరాలని అని కోరుకున్నారు. అంశాల స్వామితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేశారు కేటీఆర్.
My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today
Also Read
He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart
May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg
— KTR (@KTRBRS) January 28, 2023
కాగా.. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ లో అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశారు. కాగా.. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా మునుగోడు వెళ్లిన కేటీఆర్.. ఆ తర్వాత శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామిని కలిశారు. ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు అంశాల స్వామితో కేటీఆర్ మాట్లాడారు. అంశాల స్వామి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, అంతేకాకుండా.. హెయిర్ కటింగ్ సెలూన్, ఇంటి నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన గతంలోనూ అంశాల స్వామి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆర్థిక సహాయం కూడా చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ. 5.50 లక్షలు మంజూరు కూడా చేయించారు…మిగతా ఇంటి నిర్మాణ పనులను కేటీఆర్ కార్యాలయంతో పర్యవేక్షించి పూర్తయ్యేలా చొరవ కూడా చూపారు.
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!