Nallamilli Moola Reddy Passes Away: తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) సోమవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం రామవరంలోనే ఉంటున్న మూలారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగారు. 1970లో రామవరం సర్పంచ్ గా మూలారెడ్డి ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం నుంచి…
senior cartoonist papa passes away: ప్రముఖ కార్టూనిస్టు పాప (77) శనివారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. బాల్యంలోనే వ్యంగ్య చిత్రాలు గీయడంలో పట్టు సంపాదించిన ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర ప్రతికలో ప్రచురితమైంది. ఆ తర్వాత కథలకు బొమ్మలు గీయడంలోనూ ఆయన ప్రావీణ్యం సంపాదించారు. యుక్తవయసులోనే ఆంధ్ర పత్రిక, వసుధ, జోకర్ తదితర వార, మాస పత్రికలకు బొమ్మలు గీశారు. కాలేజీ విద్య పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్…
Deepesh Bhan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ మృతి చెందాడు. శనివారం ఉదయం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు సభ్యులు తెలిపారు. ఇక దీపేష్ మరణ వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.
భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ (75) అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ ఇక లేరన్న విషయం తెలుసుకుని క్రీడా ప్రపంచం ఆవేదన చెందుతోంది. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో వరీందర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. ఫైనల్‌లో 2-1తో…
ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత్‌లో పుట్టిపెరిగిన ఆయన 2003లో భారత పౌరసత్వం వదులుకుని ఐర్లాండ్ జాతీయుడిగా మారిపోయారు. గుజరాత్‌లోని పార్సీ కుటుంబంలో 1929లో పల్లోంజీ జన్మించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ 1865లో ఏర్పాటు కాగా పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలకుగానూ పల్లోంజీ మిస్త్రీని కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 150…
ప్రముఖ పాకిస్తాన్ టెలివిజన్ హెస్ట్, పాక్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు అమీర్ లియాఖత్ (49) కరాచీలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పాక్ మీడియా గురువారం తెలిపింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ( పీటీఐ) పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. గతంలో పలు కీలక స్థానాల్లో పనిచేశారు. కరాచీలోని ఖుదాద్ కాలనీలోని అతని ఇంటిలో అపస్మారక స్థితిలో అమీర్ లియాఖత్ హుస్సెన్ కనిపించారు.. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే బుధవారం రాత్రి నుంచే…
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. మొన్నటికి మొన్న సింగర్ కేకే మృతి చిత్ర పరిశ్రమను కోలుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. ఇంకా ఆ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోకముందే మరో హీరో గుండెపోటునితో మృతి చెందడం షాక్ కు గురిచేస్తోంది. ‘వరం’, ‘బ్యాచిలర్స్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సత్య గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ. పలు స్టార్…