YVLN Shastri: సినీ రచయిత, సెన్సార్ బోర్డ్ మెంబర్ యడవల్లి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YVLN Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు. విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడే యడవల్లి స్కూల్ ఫైనల్ చదివారు. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యంలో ప్రవేశం ఉంది. యుక్త వయసులోనే ‘నక్షత్రాలు’ పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే ‘విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు’ పేరుతో నవల రాశారు.
విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన ‘తరం మారింది’ అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలసి పని చేసే అవకాశం ఆయనకు దొరికింది. కమలాకర కామేశ్వరరావుతో కూడా పని చేశారు. విక్టరీ మధుసూదనరావుతో ఆయన సొంత సినిమా ‘ఆత్మకథ’కు వర్క్ చేశారు. యడవల్లిని నటీమణి లక్ష్మి కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటి నుండీ తెలుగు సినిమాలతో పాటు కన్నడ చిత్రాలకు సైతం పని చేస్తూ ఉన్నారు. దాదాపు పదిహేను కన్నడ సినిమాలకు రచన చేశారు. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘తెలుగు సినిమాల్లో హాస్యం’, ‘తెలుగు సినీ దర్శక మాలిక – విజయ వీచిక’, ‘తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు’ పుస్తకాలను రచించారు. పలు టీవీ సీరియల్స్ కు, కథలు – మాటలు సమకూర్చారు. శ్రీ యం. వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయం తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్ పెర్ట్ గా సేవలు అందిస్తున్నారు. అవివాహితులైన యడవల్లి డిసెంబర్ నెలాఖరులో అనారోగ్య కారణాలతో విజయవాడలోని తమ్ముడు నాగేశ్వరరావు చెంతకు చేరారు. దాదాపు యాభై రోజుల పాటు చికిత్స చేయించినా ఉపయోగం లేకపోయిందని, శనివారం రాత్రి యడవల్లి తుదిశ్వాస విడిచారని సోదరుడు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు జరిగాయి.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!