ISRO Valarmathi Passes Away: ఆమె గొంతు ఎంతో ప్రత్యేకం. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) సాధించిన ఎన్నో విజయాలు ఆమె గొంతులోనే మొదలయ్యారు. అలాంటి గొంతు మూగబోయింది. దీంతో ఇస్రోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి కొన్ని గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనకు ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది. అయితే ఆ వాయిస్ ఇచ్చేది ఎవరో కాదు ఇస్రో సైంటిస్ట్ వలార్మతి. ఇస్రో ప్రయోగించిన ఎన్నో రాకెట్ల కౌంట్ డౌన్ కోసం ఆమె వాయిస్ అందించారు. తాజాగా చంద్రయాన్ 3 కూడా ఆమె వాయిస్ తో కౌంట్ డౌన్ చెప్పిన తరువాతే నింగిలోకి దూసుకు వెళ్లింది. అలాంటి వలార్మతి గుండెపోటుతో మరణించారు. ఇస్రో నుంచి రిటైరైన వలర్మాతి చైన్నెలో తన నివాసంలో ఉంటున్నారు. శనివారం గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచారు. వలర్మాతి చనిపోయిన వార్తతో ఇస్రోలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Tamil Nadu: బీజేపీ నేత కుటుంబం దారుణ హత్య
ఆమె 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించారు. కోయంబత్తూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశారు. తరువాత 1984లో ఇస్రో చేరారు. అప్పటి నుంచి ఎన్నో సేవలు అందించారు. ఇన్ శాట్ 2ఎ, ఐఆర్ఎస్ ఐసి, ఐఆర్ఎస్ ఐడి, టెస్ తో సహా అనేక మిషన్స్ లో పాలుపంచుకున్నారు. 2012లో విజయవంతంగా ప్రయోగించబడిన భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రీశాట్-1 కి ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఆమె 2015లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ను అందుకున్న మొదటి వ్యక్తి. ఇంతగా దేశానికి ఎనలేని సేవలు అందించిన వలార్మతి మరణించడంతో ఇస్రో లో విషాద ఛాయలు అలుముకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.