కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కుమారి అనంతన్ (93) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున చెన్నైలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో అనంతన్ ప్రాణాలు వదిలారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007లో గెలుపొందారు.
రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ (78) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.
Kuna Venkatesh Goud: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.
కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజుల క్రితయం ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సీతారాం ఏచూరి మృతితో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.