తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కృష్ణబాబు.. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు తీసుకు వెళ్లనున్నట్లు బంధువులు ప్రకటించారు.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తల్లి లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. హన్మకొండలో ఓ ప్రయివేట్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. బలరాం నాయక్ స్వస్థలం ములుగు జిల్లా మదనపల్లి గ్రామం. బలరాం నాయక్.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా.. గతంలో బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో…
కొలీవుడ్ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ గుండె పోటుకు గురై ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..48 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరిని కదిలించి వేస్తుంది. గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుది శ్వాస విడిచారు.. డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. చిత్తూరుకు చెందిన డేనియల్ తండ్రి ఒక తెలుగువాడు కాగా, తల్లి తమిళియన్.. ఈయన జీవితం పూల పాన్పు కాదు ఎన్నో కష్టాలను చుసాడని తెలుస్తుంది..…
ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఉండగానే మధ్యలోనే ప్రాణాలను విడిచారు..ఈయన మరణం ఇండస్ట్రీకి తీరన లోటు. ఒక పెద్ద విలన్ ను ఇండస్ట్రీ కోల్పోయింది.. ఈయన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్…
అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు.. తెలుగులో సత్యం సినిమాతో పరిచయమైన డైరెక్టర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పచ్చ కామెర్లు రావడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.. ఆయన మరణం పై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.. ఈయన మాస్టర్ సురేష్ పేరుతో దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించారు.. ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’,…
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాద్వి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.. ఆదివారం రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.. సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెనొప్పికి గురయ్యారు. వేగంగా ఆయన్ని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ మరణించారు.. ఆయన అంత్యక్రియలను సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది.…
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది.…