Sitaram Yechury: బాల్యం మొత్తం హైదరాబాద్లోనే.. సీతారాం ఏచూరి జీవిత విశేషాలు
- సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం
- ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసిన తల్లి
- ఏచూరి సీపీఎంలో 1992 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడు
- 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యులు
- బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపిన ఏచూరి
- హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య
- 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత.. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సీతారాం ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. ఆయన హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఏచూరి ఢిల్లీకి చేరారు. సీతారాం ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్, జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.
Read Also: Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!
Also Read
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరిన ఏచూరి.. 1975 ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్ట్ కావడంతో స్టడీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. మరోవైపు.. ఎమర్జెన్సీ టైమ్‌లో ఏచూరి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. అనంతరం ఆయన.. 1977-78 మధ్య జేఏన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984 సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి.. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు. 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ పొందారు. 2005 నుంచి 2015 వరుసగా మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అలాగే.. హిందుస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్.. 20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా పని చేశారు.
Read Also: Big Breaking: సీతారాం ఏచూరి కన్నుమూత..
సీతారాం ఏచూరికి ఇంద్రాణి మజుందార్‌తో వివాహం అయింది. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి ఉన్నారు. జర్నలిస్ట్ సీమా చిస్తీని ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!