ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశం ఆధునికత దిశగా సాగడంలో దాన్ని కొనసాగించడంలో ఇరవై సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయకరణ, గరీభీ హటావో నినాదంతో ఈ దేశ భవిష్యత్తు మీద చెరగని ముద్ర వేసింది ఇందిరా గాంధీ అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
అటువంటి దేశం నేటి పాలకుల చేతిలో అపహాస్యానికి గురవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ఆరోపించారు. దేశాన్ని రక్షించడం కోసం రాజ్యాంగ మౌళిక సూత్రాలను.. దేశ వనరులను కాపాడడం కోసం సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమిని గెలిపించాలని అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఝార్ఖండ్‌లో ఘనవిజయం సాధిస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. భోకారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్వేతా సింగ్‌ను గెలిపించి చట్ట సభలకు పంపాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోకారో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ గుప్తా, ఏఐసీసీ మెంబర్ మనోజ్ సింగ్, సుశీల్ ఝా, ఉమేష్ గుప్తా డీసీసీ అధ్యక్షులు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: PM Modi Diwali Celebrations: సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ