Ponnam Prabhakar: సమగ్ర కుల సర్వేలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కుటుంబ సర్వేలో భాగంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలని తెలిపారు. ఇప్పటికీ కేసీఆర్, కిషన్ రెడ్డి కుల సర్వేలో పాల్గొనలేదని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలన్నారు. సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉంటే మంచిది కాదన్నారు. సమాచార శాఖలో మీరు భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
Read also: Emmanuel Macron: నా పదవికి ఎలాంటి గండం లేదు.. త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తా..
ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టీ విమర్శించడం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వాళ్లుగా, ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేశారు. అందరూ సమాచారాన్ని ఇవ్వాలని, ఈ సర్వేలో పాల్గొనాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు లేవు గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చామన్నారు.
Rapo22 : మీలో ఒకడు సాగర్.. రామ్ పోతినేని ఫస్ట్ లుక్ సూపర్బ్