Constitution Debate: భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్‌సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు.
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
పార్లమెంటులోకి ప్రవేశించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కారు దిగిన వెంటనే, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు గులాబీ పువ్వుతో పాటు త్రివర్ణ పతాకాన్ని అందజేశారు.
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం
పార్లమెంటుకు వచ్చిన వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఒక చమత్కారమైన బ్యాగ్‌ని తీసుకెళ్లారు. ఆ బ్యాగ్‌పై ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఫోటోలు ఉండగా.. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదంతో కూడిన డిజైన్ బ్యాగ్ ను ఆమె తీసుకెళ్లారు.
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది…
ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . "కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని పేర్కొంది.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో.. ఖర్గే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ…