ప్రధాని మోడీ సోమవారం పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎంపీలు, నటీనటులతో కలిసి ప్రధాని సినిమా చూశారు.
పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ గురువారం పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేరళీయులు ఇష్టపడే కసువ చీర ధరించి ఆమె లోక్‌సభలోకి ప్రవేశించారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Parliament Winter session: ఇవాళ్టి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. సెలవులు తీసి వేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్.. ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండర్న్ను తొలగించారు. దీంతో బుధవారం సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. దేశానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో లిండర్న్ ద్రోహం చేసినట్లుగా ఓలాఫ్ భావించారు.
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును…
పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఈ సమావేశాలు రాజకీయ వేడెక్కే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిప్పుపుట్టించనున్నాయి. నెక్స్ట్ అంతకు మించిన కొత్త బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. READ MORE: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం.. మోడీ…
Robert Vadra: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలను రాబర్ట్ ఈ సందర్భంగా మండిపడ్డారు.