New Income Tax Bill: కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుని గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ బిల్లు ద్వారా పన్ను చట్టాల భాషను సరళీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దీనిని పార్లమెంట్ ఆర్థిక స్థాయి సంఘానికి పంపుతారు. ఇది ప్రస్తుత పన్ను స్లాబ్‌లను మార్చడు, పన్ను రీబేట్స్‌ని సమీక్షించదు. పన్నుల భాషను సరళీకరించడం వల్ల చట్టాలు సంక్షిప్తంగా, స్పష్టంగా మరియు సులభంగా అర్థం చేసుకోగలదని..ఇది వివాదాలు, వ్యాజ్యాలను తగ్గిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను ఖచ్చితత్వాన్ని అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Uttam Kumar Reddy : ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం
సమీక్షను పర్యవేక్షించడానికి CBDT ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, ఆరు దశాబ్దాల నాటి చట్టాన్ని భర్తీ చేసే ప్రతిపాదిత బిల్లులోని వివిధ అంశాలను సమీక్షించడానికి 22 ప్రత్యేక ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. బిల్లును రూపొందించే ముందు ప్రభుత్వం భాష సరళీకరణ, వ్యాజ్యాల తగ్గింపు, సమ్మతి తగ్గింపు, అనవసరమైన/వాడుకలో లేని నిబంధనలు అనే నాలుగు వర్గాలపై అభిప్రాయాలను ప్రజల నుంచి కోరారు. ఈ చట్టాన్ని సమీక్షించడంపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కి వాటాదారుల నుంచి 6500 సూచనలు అందాయి.