బీజేపీ ప్రభుత్వం (BJP Government) పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోడీ (PM Modi) అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో (Parliament) ప్రధాని మోడీ ప్రసంగించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నేడు చివరి రోజు.. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. జనవరి 22న జరగనున్న రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంపై చర్చతో 17వ లోక్‌సభ ఈరోజుతో ముగియనుంది.
అన్నదాతలు మరోసారి పార్లమెంట్ ముట్టడికి (Parliament) పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం భారీగా నోయిడా, హర్యానా, యూపీ నుంచి పెద్ద ఎత్తున రైతులు (Farmers Protest) బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గత పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను 'దిష్టిచుక్క'గా అభివర్ణించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ వీల్ చైర్లో కూడా వచ్చి పని చేశారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారాన్ని ప్రశంసించారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘శ్వేతపత్రం’కు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ పేపర్’ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' ప్రస్తావనకు రానుందని సమాచారం.
యాంటీబయాటిక్స్ని అనవసరంగా వాడకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, మంత్రిత్వ శాఖలోని విభాగాలు వారి స్థాయిలో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నాయి.
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది.