యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, మంత్రిత్వ శాఖలోని విభాగాలు వారి స్థాయిలో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నాయి.
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది.
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు.
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) నాడు లోక్‌సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశ పెట్టబోతుంది.
మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు పేరుతో ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షలలో అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.