18వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు కూడా స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టాయి.
MP Gopinath : గత నెలలో దేశం మొత్తం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు గోపీనాథ్. ఇక నేడు జరిగిన పార్లమెంటు సమావేశంలో 40 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమిళనాడు ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో మొదటగా కాంగ్రెస్…
Asaduddin Owaisi: 18వ లోక్సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులచే స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణస్వీకారం లోక్సభలో దుమారం రేపింది. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఓవైసీ, ‘‘జై పాలస్తీనా’’ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. Read Also: Darshan Case: యాక్టర్ దర్శన్ కేసులో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యని కలిసిన రేణుకాస్వామి పేరెంట్స్.. అసదుద్దీన్…
కొత్తగా కొలువు తీరిన లోక్సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి కూడా చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, “విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎవరో తేలిస్తేనే స్పీకర్కు మద్దతు ఇస్తామని విపక్షాలు అంటున్నాయి. ఇలా రాజకీయాలు చేయడం సరికాదు” అని తెలిపారు. “డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఎలాంటి నిబంధన లేదు. లోక్సభకు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా అన్ని…
కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు…
Om Birla : లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రెండోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా ఇవాళ మళ్లీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు ఎగువ సభ సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పట్నాయక్ వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని ఎంపీలను కోరారు. సమావేశం అనంతరం రాజ్యసభలో పార్టీ నేత సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. 'ఈసారి బీజేడీ ఎంపీలు…
దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె, న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం ఎంపీ బన్సూరి స్వరాజ్ సోమవారం పార్లమెంట్లో లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ తొలి సెషన్లో ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా.. బన్సూరి స్వరాజ్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో చప్పట్లతో పార్లమెంట్ ప్రతిధ్వనించింది. ఎందుకంటే బాన్సూరి స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. బన్సూరి స్వరాజ్.. తన తల్లి బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ కూడా తొలిసారి ఎంపీ అయినప్పుడు.. ఆమె సంస్కృతంలో…