CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే మకాం..
- నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
- రేపు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు..
- ఇవాళ-రేపు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరుకావడంతో పాటుగా పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ లాంటి అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వీలును బట్టి ఆయన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.
Read also: Astrology: జూన్ 24, సోమవారం దినఫలాలు
Also Read
దీనిపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి ఏఐసీసీ ముఖ్యనేతలు చర్చించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, పార్టీలో చేరిన వారి వాగ్దానాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించగా, కొన్ని జిల్లాలకు అస్సలు సీట్లు రాలేదు. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు ఎవరైనా వస్తే వారికి మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో విస్తరణ జరగవచ్చని సమాచారం.
What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?