కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్‌గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇచ్చే అవకాశం ఉంది.