Pawan Kalyan: పార్లమెంట్ పాత భవనం వేదికగా జరిగిన ఎన్డీఏ పక్షాలు, ఎంపీల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సమావేశంలో మూడోసారి ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించారు రాజ్‌నాథ్‌సింగ్.. ఆ ప్రతిపాదనను అమిత్‌షా, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీష్ కుమార్, షిండే సహా ఇతర ఎన్డీఏ నేతలు బలపరిచారు.. ఇక, ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. దేశానికి మోడీ ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు.. యావత్ దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.. ఇక, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు. మీ దిశానిర్దేశంతో ఏపీలో 91 శాతం పైగా సీట్లు సాధించామని తెలిపారు. మోడీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు పవన్ కల్యాణ్.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Read Also: Crime: రూ.300కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు.. కట్ చేస్తే..