Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు దిగువ సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ప్రధాని మోడీ ప్రపంచంలో ప్రతిదీ తొలగించబడింది” అని మంగళవారం అన్నారు. “మోడీ జీ ప్రపంచంలో, సత్యాన్ని నిర్మూలించవచ్చు. కానీ వాస్తవానికి, సత్యాన్ని తొలగించలేము. నేను చెప్పవలసింది నేను చెప్పాను, అదే నిజం. వారు కోరుకున్నంత వెలికితీయగలరు. సత్యమే సత్యం” అని ఆయన పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో అన్నారు. తరువాత, కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభ…
అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు అంటేనే హాట్ హాట్‌గా సాగుతుంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో సభలో ఎప్పుడూ సీరియస్ వాతావరణం నెలకొంటుంది. ఏ దేశ సమావేశాలైనా ఇలాంటి వాతావరణమే నెలకొంటుంది.
లోక్‌సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సమావేశం అంతా హాట్ హాట్‌గా సాగింది. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఈరోజు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నీట్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్‌పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
INDIA bloc: పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయింది. ఈ సమావేశానికి కూటమిలోని పలువురు నేతలు హాజరయ్యారు.
పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bullet Trains: భారతదేశంలో ‘‘బుల్లెట్ ట్రైన్’’ వ్యవస్థను విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అహ్మాదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చకచక జరుగుతున్నాయి.