అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు అంటేనే హాట్ హాట్‌గా సాగుతుంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో సభలో ఎప్పుడూ సీరియస్ వాతావరణం నెలకొంటుంది. ఏ దేశ సమావేశాలైనా ఇలాంటి వాతావరణమే నెలకొంటుంది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్‌లో మాత్రం ఒక ఆసక్తికర సన్నివేశం నవ్వులు పూయించింది. ఒక మహిళా ఎంపీ- స్పీకర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులందరూ కడుపుబ్బ నవ్వుకునేలా చేసింది.
ఇది కూడా చదవండి: RACHARIKAM Movie: ఆర్జీవీ పోరి ఇలా అయ్యిందేంటి..? భయపెడుతున్న అప్సరా రాణి..
పాకిస్థాన్ సమావేశాల్లో ప్రస్తుత ఎంపీ, ఇమ్రాన్‌ఖాన్ హయాంలో మంత్రిగా పని చేసిన జర్తాజ్ గుల్ సభలో సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. అయితే ఆమె వైపు స్పీకర్ సాధిక్ చూడడం లేదు. దీంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ నేతలంతా ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పించారని.. తాను ప్రజల తరపున వచ్చిన నాయకురాలిని వ్యాఖ్యానించారు. అంతేకాదు 1,50,000 ఓట్లతో సభలోకి అడుగుపెట్టినట్లు గుర్తుచేశారు. తాను మాట్లాడుతున్నప్పుడు తన వైపు చూడకుండా ఉంటే మాట్లాడలేనన్నారు. దయచేసి కళ్లజోడు పెట్టుకొని తన పైపు చూడాలని ఆమె స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్ హాస్యం జోడించి.. తాను మీ మాటలు వింటున్నానని.. కానీ మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం మర్యాదగా అనిపించదని.. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. సభ్యులంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. అనంతరం జర్తాజ్ గుల్ ప్రతి స్పందిస్తూ.. మహిళలను సూటిగా చూడకూడదని మీరు అనుకుని సభలో 52 శాతం మహిళలను తొలగిస్తే.. మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో పాల్గొంటారని కౌంటర్ వేశారు. ఈ సన్నివేశాన్ని పాకిస్థాన్ మీడియా హైలెట్ చేసి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియోను 1.3 మిలియన్లకు పైగా వీక్షించారు. నెటిజన్లు కూడా సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
జర్తాజ్ గుల్ ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అక్టోబర్ 5, 2022 నుంచి ఏప్రిల్ 10, 2022 వరకు పని చేశారు. ఇక ఆగస్టు 2018 నుంచి జనవరి 2023 వరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో డేరా ఘాజీ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
Meanwhile..Parliament in Pakistan pic.twitter.com/U5GcDD4Dp1
— We Dravidians (@WeDravidians) June 30, 2024