శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్‌లో కడప జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్‌టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని…
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్‌లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్‌సభలో జీర్ అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రహ్లాద్ జోషి…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. ఏపీలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆదాయం సృష్టించే మార్గాలను మరిచి రుణాలపైనే ఆధారపడుతోందని ఆయన…
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ…
టీఆర్ ఎస్ పార్టీ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫంక్షన్స్ ఉన్నాయనే టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటేనని… పార్లమెంట్ లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చిందని మండిపడ్డారు. గతంలో ఆ రెండు పార్టీ లు పొత్తు పెట్టుకున్నాయని.. సీఎం సంతకాలు చేసేటప్పుడు సోయిలో ఉండి చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో సంతకం పెట్టాడు……
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
ఖరగపూర్, విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ-నాగపూర్(975కి.మీ)ల మధ్య “డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్” నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ “నేషనల్ మినరల్ పాలసీ” కింద “డెడికేటెడ్ మినరల్ కారిడార్లు” ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మైనింగ్ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. “మినరల్…
ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం…