యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్‌సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీల…
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో తెలంగాణ రైతుల సమస్యల గురించి పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే… రెండు సభలోని చర్చ జరగాలని ప్రతిపాదించినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణ రైంతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు. ఇది తెలంగాణ రాష్ర్ట సమస్య, రైతుల గురించి పోరాడుతున్న మాపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. లోక్‌సభ, రాజ్యాసభలో నిరసన తెలిపామన్నారు. కేంద్రం మీద బియ్యం కొనాల్సిన బాధ్యత ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.…
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘రైతులు చనిపోయారా? మాకు తెలియదే… పరిహారం ఎలా ఇస్తాం?’ అంటూ రైతు ఉద్యమాన్ని అవమానపరిచేలా సమాధానం ఇచ్చారు. రైతులు చేపట్టిన…
వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది…
12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన రాజ్యసభ ఛైర్మన్.. శీతాకాల సమావేశాల నుంచి కూడా మొత్తంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఎంపీలు ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, డోలా…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంటీరీ సమావేశాలు నిర్వహించుకుంటూ సమావేశాల్లో ప్రత్యర్థులపైన పన్నాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేజేపీ కూడా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. దీనితో పాటు సాయంత్రం 5గంటలకు రాజ్యసభ…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది… సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక, ఈ సెషన్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ…