కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది : వైఎస్సార్‌సీపీ ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పార్లమెంట్ సమావేశాల అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ.. విభజన హామీల పట్ల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సాయం విడుదల చేయాలని, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఆరోపించారు. చంద్రబాబు బుద్ధి మారాలి.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలి. చేతికందిన కూడును నోటికి అందకుండా.. పేదల నోటికి, చేతికి చంద్రబాబు అడ్డుపెడుతున్నాడు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు అంత ఉలుకెందుకు..? అంటూ వారు ప్రశ్నించారు.
మరో రెండేళ్ళలో విభజన హామీలు నెరవేర్చడానికి ఇచ్చిన కాలపరిమితి పూర్తికానుండటంతో వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉందని, అలాకాకుండా, స్వార్థ రాజకీయాలే పరమావధిగా టీడీపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి విమర్శలు చేయడం అంటే.. పేదవాడి పొట్టగొట్టడమేనని అన్నారు. ఎవరి వద్దా చేయి చాచకుండా, పేదవాడు తలెత్తుకుని గౌరవంగా బతకడానికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. వాటిని వృథా అనటానికి నోరు ఎలా వచ్చిందని వైసీపీ ఎంపీలు దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఓ వర్గం ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారే తప్పితే.. అందులో రాష్ట్ర ప్రయోజనాలు లేవని చెప్పారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!