Rashtrapatni Comments: ద్రవ్యోల్భనం, ఈడీ కేసులు, నిరుద్యోగం, జీఎస్టీ తదితర అంశాలపై కాంగ్రెస్ పోరాడుతోంది. అధికార పార్టీ బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని రేపాయి. అధీర్ రంజన్ చౌదరి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ..‘‘ రాష్ట్రపత్ని’’ అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తోంది.
Read Also: COVID 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను కించపరుస్తూనే ఉంటారని.. మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో, బయట కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపత్ని అని సంభోదించడం.. అత్యున్నత రాజ్యాంగ పదవిని కించపరిచేలా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేవారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దళిత, మహిళ వ్యతిరేకి అని దేశానికి తెలుసని స్మృతి ఇరానీ విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరసనల్లో పాల్గొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. నేను పొరపాటున రాష్ట్రపత్ని అని అన్నానని.. ఈ వ్యాఖ్యలను గోరంతది కొండతగా చేసి బీజేపీ వివాదం చేస్తోందని అన్నారు.