పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, చివరి దశ ఓటింగ్ వరకు రామమందిరం గురించే చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పెద్దలంతా రామమందిర అంశాన్ని ప్రస్తావించారు.
MP Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్‌లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నవనీత్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు అయ్యింది.
Elections 2024: హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఓటు వేసేందుకు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. తెలంగాణలో ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి.
Kadiyam Srihari: నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
BRS MLA Harish Rao on Medak BJP Candidate Raghunandan Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా?.. ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా? అని ప్రశ్నించారు. దేవుడిపై ఎంతో భక్తి ఉన్న కేసీఆర్.. ఏనాడు రాజకీయాలకు వాడుకోలేదన్నారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టారు..…
Medak Parliament Leaders complaining against each other: తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. గులాబీ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఎన్నికల కమిషన్, పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దాంతో సంగారెడ్డి టౌన్ పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు.…
Harish Rao Campaign in Medak: 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని, ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని, ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని…
Swarna Sudhakar Reddy: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.