Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో లాల్ దర్వాజ చేరుకోనున్నారు. లాల్‌దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు గంటపాటు ఈ రోడ్‌షో సాగనుంది. రోడ్ షో అనంతరం అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
Read also: Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!
ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి, ప్రచార సరళిపై ఆరా తీస్తారు. నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి మోడీ పదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహసోపేత నిర్ణయాలు, తెలంగాణకు చేసిన సాయం, భారతీయ జనతా పార్టీ ఆవశ్యకతను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలన్నారు. సభ అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Read also: Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. 8 రాష్ట్రాల్లో 16 మందికి నోటీసులు
అమిత్ షా పూర్తి షెడ్యూల్
* అమిత్ షా రాత్రి 7.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు
* బేగంపేట నుంచి కేంద్ర హోంమంత్రి లాల్ దర్వాజకు వెళ్లనున్నారు
* హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు
* రాత్రి 8 నుంచి 9 వరకు అమిత్ షా రోడ్ షోలో పాల్గొంటారు
* రోడ్ షో అనంతరం బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు
* సమావేశం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేస్తారు
Parusuram :ఫ్యామిలీ స్టార్ తరువాత ఊహించని హీరోను పట్టిన పరశురాం..