Kadiyam Srihari: నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిన కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని వరంగల్ కి వచ్చారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంభం పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల తరువాత బీఆర్ఎస్ మూత పడబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క సిటు కూడా బీఆర్ఎస్ గెలవడం లేదన్నారు. బీఆర్ఎస్ ఓటింగ్ శాతం 20 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయిందన్నారు. బీజేపీ కంటే బీఆర్ఎస్ వెనకపడిందన్నారు. కవిత పైనా బీజేపీ వాళ్ళు కుట్రతో కేసులు పెట్టారు అని కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దేశంలో ఒక్క కవితనే ఉందా? తప్పు లేనిదే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. నీ బిడ్డా లిక్కర్ కేసులో ఉన్నందుకు కేసీఆర్ సిగ్గు పడాలన్నారు. కవిత వల్ల కేజ్రీవాల్ నష్టపోయారని తెలిపారు. నీ బిడ్డ వళ్ళ కేసుల్లో కేజ్రీవాల్ ఇరుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Hemant Soren : హేమంత్ సోరెన్‌కు షాక్.. విచారణ మే 6కు వాయిదా
రాజయ్య మీద ప్రేమ ఉంటే వరంగల్ పార్లమెంట్స్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎదురుగా ఒక మాట మాట్లాడుతారు.. లోపల మరొక్క తీరు మాట్లాడే నైజం కేసీఆర్ ది అంటూ మండిపడ్డారు. వరంగల్ కి కేసీఆర్ చేసింది ఏంటి? అని ప్రశ్నించారు. వరంగల్ కి కనీసం మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని చెప్పిన అప్రవల్ అవ్వలేదన్నారు. వరంగల్ అంటే కేసీఆర్ కి కోపం వరంగల్ జిల్లా అంటే కేసీఆర్ కి ప్రేమ లేదని తెలిపారు.
ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కవ మంది కాబట్టి ఆయనకు వరంగల్ అంటే భయం అన్నారు. సీఎం సంభందం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారా? అని నిప్పులు చెరిగారు. నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజం అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కుటుంభంనికీ వేలాది ఎకరాల భూము ఎలా వచ్చాయ్నన్నారు. అరూరి రమేష్ కి వరంగల్ చుట్టూ వందలాది ఎకరాల భూమి ఎలా వచ్చింది అన్నారు. కబ్జా చేయడంతోనే భూములు వస్తాయన్నారు.
Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..