థర్డ్ వేవ్ ముప్పు..! విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్‌డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది. మరో ఆరేడు వారాల్లో కరోనా థర్డ్‌వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో విద్యాసంస్థల పున:ప్రారంభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. పిల్లలపై ఇంకా ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులకు ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో పిల్లలకు టీకా ఇవ్వడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీనికి తోడు మూడో దశ కరోనా విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా తగ్గాకే పిల్లలను స్కూల్స్‌కి పంపిస్తామంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. థర్డ్‌వేవ్ ముప్పుందని హెచ్చరిస్తున్నా.. విద్యాసంస్థలను ఎలా తెరుస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జులై ఒకటి నుంచి విద్యా సంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్‌లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!