కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడినిపెళ్లి చేసుకుంటానని చెప్పిన సదరు యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసారు. యువతి ఓ యువకుడిని ప్రేమించగా ఆ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యులతో వాగ్వాదం జరుగుతుంది. ఇదే క్రమంలో మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా నిరాకరించిన యువతి… తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసారు. యువతి కేకలు వేయడంత స్థానికులు వచ్చి మంటలు ఆర్పేయగా ప్రాణాల నుండి బయటపడింది యువతి. అయితే తీవ్రంగా గాయపడిన యువతిని కడప రిమ్స్ కు తరలించారు.