విమానం వెనుక భాగానికి స్కైడైవర్ పారాచూట్ చిక్కుకుపోయిన సంఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. సుమారు 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం వెనుక భాగానికి తాకి చిక్కుకుపోయింది. దీంతో అతడు గాల్లోనే వేలాడుతూ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని దక్షిణ కెయిర్న్స్ ప్రాంతంలో చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. స్కైడైవింగ్ సమయంలో అనూహ్యంగా…