బయట మెడికల్ లో రూ.200 విలువ చేసే "ఐసోసర్బైడ్" మందులను కేవలం 21 రూపాయలకు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెల్లించారు. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు. read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్…
పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమీర్ పేట బొంగుల బస్తీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు..డబ్బులు చోరీ చేసేందుకు యత్నించాడు. సీసీ కెమేరాతో పాటు ఏటీఎం కు ఏర్పాటు చేసిన కీబోర్డ్ ను ధ్వంసం చేశాడు. ముంబై లోని బ్యాంకు చెందిన కంట్రోల్ రూమ్…
హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. Read Also: జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి… ధర్నాకు దిగిన కుటుంబీకులు ఈ బ్రిడ్జి నిర్మాణం…
నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్‌బాబు షేక్, నూర్ మహ్మద్…
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో పబ్‌ను హెచ్చరించిన యాజమాన్యం తీరు మార్చుకోలేదన్నారు. పోలీసులు దాడి అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్‌ను నిర్వహిస్తున్నారన్నారు. పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాలీవుడ్ పబ్‌లో సమయం దాటిన తరువాత కూడా యువతీ, యువకులు అర్ధనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్‌లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది..…
హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also:…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. చిన్నారి మృతదేహాన్ని ఓ ఆటోలో నిందితులు తీసుకొచ్చినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. నిందితులు బెంగళూరులో పాపని చంపి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గా గుర్తించారు. పాప హత్య కేసు…