నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్‌బాబు షేక్, నూర్ మహ్మద్ ఖాన్ ఏపీ, తెలంగాణలో డ్రగ్స్ విక్రయించాడానికి నియమించుకున్నారు. ఈ ఇద్దరి నుండి 100 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ దందా అంతా ఓయో రూంల కేంద్రంగా నడుస్తుందన్నారు.
Read Also:హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రంగా మారుతుందా..?
కస్టమర్లకు ఈ డ్రగ్స్‌ను ఓయో రూమ్‌ల నుంచి సప్లై చేస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో గ్రాము 10 వేల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. మొత్తం 20 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో రెండు అంతరాష్ట్ర ముఠాతో పాటు నగరానికి చెందిన ఓ ముఠా అరెస్ట్ చేసినట్టు నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించారు. పంజాగుట్ట నారాయణ గూడ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. పోలీసులు రైడ్ చేసి విచారణ జరిపి మొత్తం 7గురుని అరెస్టు చేశామని తెలిపారు. ప్రధాన సూత్రధాని టోనీ నైజీరియన్‌కు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. టోనిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.